Header Banner

ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాటం... ప్రభుత్వ దృష్టికి సమస్యలు తీసుకెళ్తా! ఎమ్మెల్సీ అభ్యర్థి స్పష్టం!

  Sun Feb 23, 2025 17:32        Politics

ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాలు తనకు మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆదివారం ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో కృష్ణా - గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆలపాటి రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా మాట్లాడుతూ.. విద్యా వ్యాప్తి కోసం ఎటువంటి అదనపు పనులు లేకుండా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి డీఎస్సీ ప్రకటించారని గుర్తు చేశారు. దీని ద్వారా ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి కలుగుతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ స్కూల్‌లో ఖాళీలు ఉన్నాయో.. వాటి ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తామని తెలిపారు. గడిచిన ఐదేళ్లలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయ లేదని గుర్తు చేశారు.


ఇది కూడా చదవండి: అరబ్ అడ్వొకేట్ తో చర్చించిన అనిల్ ఈరవత్రి! 17 మంది భారతీయులను ఉరిశిక్ష! 


అప్పటి ప్రభుత్వంతో ఉపాధ్యాయులు సమస్యలపై పోరాడకుండా లాలూచీ పడ్డారని ఆరోపించారు. శాసనమండలిలో అమరావతి రాజధాని బిల్లు పెట్టినప్పుడు మీ గొంతు ఎందుకు లేవ లేదని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో మద్యం దుఖాణాల ముందు ఉపాధ్యాయులను కాపలా ఉంచారని విమర్వించారు. ప్రభుత్వం వద్ద మీకు గౌరవం దక్కక పోతే మీ తరుపున తాను పోరాడతానని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ సభ్యులు ఉపాధ్యాయులు తనకు మద్దతు తెలుపుతోన్నందకు ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం కోసం పోరాడే వారిని గెలిపించాలంటూ ఉపాధ్యాయులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఫిబ్రవరి 28న జరగనున్నాయి. వీటి ఫలితాలు మార్చి 3వ తేదీన వెలువడనున్నాయి. ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతోన్న ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #mlc #elections #graduate #todaynews #flashnews #latestupdate